పలు దినపత్రికలనుండి వివిధ అంశాలను తీసుకుని,వాటిమీద చిన్నపాటి చర్చను ఇక్కడ జరపాలన్నది ఈ టపా ఉద్దేశ్యం.అందరూ అన్నిటికి సమాధానాలు ఇచ్చినా సంతోషమే,కొందరు కొన్నిటికి,లేక అన్నిటికి జవాబులు చెప్పినా సంతోషమే.వీలయినన్ని ఎక్కువ సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నించాల్సిందిగా మనవి.అందుకే ఈ ఆదివారం మీకు విశ్రాంతి లేదు అంది...:)
వార్త దినపత్రిక వారు ఆహ్వానిస్తున్న ఈ చర్చకు మీరిచ్చేసమాధానాలు ఏమిటి?
తనవయసుకు సగానికి పైగా పెద్దవాడిని ప్రేమించటం,పెద్దలు కాదనటం,ఇంట్లొ బంధించటం...ఇదంతా ఏమిటసలు??
ఇలాంటి పొలంగట్టుల మీద,కాలవకట్టలమీద కనీసం మన పిల్లలు ఆడుకునే రోజులొస్తాయంటారా?
చందమామ పత్రిక పిల్లలకు పోటీలు నిర్వహించటం లో అంతరార్ధం పత్రికా ప్రచారమా?లేక పిల్లల్లో అవగాహన పెంచటమా??కానీ పూర్తిగా మహానగరాలను మాత్రమే ఈ పోటీలకు వేదికలుగా ఎంపికచేయటంలోని పరమార్ధం?
ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఇలాంటివాల్ పేపర్లు పైగా పరోక్షంగా మద్యపానానికి ప్రచారం చేసే వాటిని ప్రచురించవచ్చా?దీనివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా??
మహేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి ప్రచారానికొస్తాడా?ఒకవేళ వస్తే తప్పేమిటి?నందమూరి వారసులంతా తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి వస్తే కుటుంబమద్ధత్తు ఎందుకయ్యింది?అదే మహేష్ బాబు వస్తే పద్మాలయకు లాభం చేకూర్చే పని ఎలాఅయ్యింది?
కధారచయితలు తయారౌతారా?పుట్టుకొస్తారా?అవగాహనా సదస్సుల వల్ల సమకూరే లాభాలు??
తండ్రికి కొడుకే కాడెద్దు కావటమనే దైన్యస్తితి ఎందుకొచ్చింది?ఎలా తీరుతాయి మనరైతులకీ వెతలు?
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ చిరంజీవి పార్టీకి పనిచేస్తాను..అంటున్న చేగొండి హరిరామజోగయ్య మాటలకు అసలు అర్ధముందా?ఉంటే ఏమిటని మీభావన?
రాజమండ్రి పురపాలకసంఘం వారు,కందుకూరి వీరేశలింగంగారి భవనానికి ఇంకా పన్ను కట్టమని తాఖీదులు పంపుతున్నారు,ఆయన గురించి సదరు రా.పు.సం వారికి మీరు ఎలా జ్ఞానబోధ చేస్త్రారు?
పద్యకావ్యాలకు ప్రత్యేకంగా పోటీలు ..వీటివల్ల తెలుగుపద్యానికి,ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనముంటుందని మీరు భావిస్తున్నారా??