Wednesday, June 25, 2008

ఆంధ్రజ్యోతి మీది దాడి మొదటిది కాదు,చివరిదీ కాదు..

అర్ధరాత్రి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు,మరిద్దరు జర్నలిస్టులను అరస్టు చెయ్యటం పట్ల నా నిరసనను తెలియజేస్తున్నాను.ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల
యోగక్షేమాలు గురించి,సాధకబాధకాల గురించి ఏర్పడిన అంతర్జాతీయసంఘం కమిటి
COMMITTE FOR THE CONCERNED JOURNALISTS,NEWYORK(http://www.concernedjournalists.org/) సభ్యుడిగా ఇటీవల కాలములో పాత్రికేయులపట్ల కొన్ని
సంస్థలు ,వ్యక్తులు జరుపుతున్న అరాచకాలు,దాడులను పరిశీలిస్తుంటే అధికారపార్టీ,ప్రతిపక్షపార్టీ అని ఎలాంటి తేడాలు లేకుండా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని అవగతమౌతుంది.కానీ,కర్ర ఉన్న వాడిదే బర్రె అన్నసామెత ఇక్కడ పరోక్షంగా అమలుతుంది.కాస్త నోరు గలవాడిమీదో,పెద్దమీడియా సంస్థలలోనో పనిచేసేవారి మీద జరిగే దాడుల పట్ల వివిధ సంఘాల,మీడియా ఖండనలు,నిరసనలు ఒకరకంగా ఉంటే బక్కబడుగు వ్యక్తులు,సంస్థల్లో పని చేసేవారికి ఆమాత్రం సానుభూతి,సహానుభూతి కరువౌతుంది.

ఉదాహరణకి నెల్లూరు జిల్లా ఉదయగిరి లో వార్త విలేఖరికి జీవనాధారమైన హోటలును కూల్చి వేసారు.కానీ రాష్ట్రస్థాయిలో దాదాపు ఎలాంటి మద్దతు లభించలేదు




తాజా గొడవకు మూలకారణమైన బాడుగనేతలు అన్న వార్తాంశం పై ఆంధ్రభూమి సంపాదకులు యం.వి.ఆర్.శాస్త్రి గారు తన సహజశైలిలో ఇలా స్పందించారు.


జనసామాన్యం లో అధికసంఖ్యాకులకు మీడియా సరైన ప్రాతినిధ్యం కల్పించటం లేదంటూ పొనుగోటికృపాకర్ మాదిగ ఇలా అంటున్నారు..


ఇక ఉత్తరాంధ్రలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అనబడు తెలుగు దేశం పార్టీ నేత వీరంగాలు ఇక్కడి జర్నలిస్టులకు కొత్తకాదు.ఇది ఇటీవలి వారి ఉగ్రరూపానికో ఉదాహరణ..












కొద్దిరోజుల క్రితం యన్టీవి విలేఖరి మీద జరిగిన దాడి గూర్చి పెద్దలు పెద్దగా స్పందించలేదు.అసలు జర్నలిస్టు నాయకులు ఏసందర్భం లో ఎలా స్పందిస్తారో అర్ధం కావటం లేదని జర్నలిస్టు మిత్రులు ఆక్రోశిస్తున్నారు.చూడాలి ఆంధ్రజ్యోతి,మంద కృష్ణమాదిగల వివాదం ఏ మలుపు తీసుకుంటుందో...



Tuesday, June 24, 2008

ఈవార్తను ఎవరైనా చదివారా?చదివినా స్పందించలేదా?







పాఠశాల,కళాశాలల స్థాయి లో తెలుగు విద్యాబోధనను విపరీతంగా ప్రభావితం చేసే ఈ వార్త 19 తేదీన ఆంధ్రభూమి దినపత్రిక ప్రచురించింది.మిగిలిన పత్రికల్లో ఎవరైనా ఇంతప్రాముఖ్యత కలిగిన వార్తను చూసుంటే తెలియజేయగలరు.

Monday, June 23, 2008

ఈనాడు,సాక్షి ఒక్కలాగే "ఆరేసాయి"



అయ్యా అదీ సంగతి.ఇవ్వాళ్టి ఈనాడు,సాక్షి దినపత్రికలు ఫెదరర్ వార్తను ఒక్కలాగా ఎలా ఆరేసాయో చూసారుగా!!!