Saturday, August 2, 2008

ఈ ఆదివారం మీకు విశ్రాంతి లేదు....

పలు దినపత్రికలనుండి వివిధ అంశాలను తీసుకుని,వాటిమీద చిన్నపాటి చర్చను ఇక్కడ జరపాలన్నది ఈ టపా ఉద్దేశ్యం.అందరూ అన్నిటికి సమాధానాలు ఇచ్చినా సంతోషమే,కొందరు కొన్నిటికి,లేక అన్నిటికి జవాబులు చెప్పినా సంతోషమే.వీలయినన్ని ఎక్కువ సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నించాల్సిందిగా మనవి.అందుకే ఈ ఆదివారం మీకు విశ్రాంతి లేదు అంది...:)

వార్త దినపత్రిక వారు ఆహ్వానిస్తున్న ఈ చర్చకు మీరిచ్చేసమాధానాలు ఏమిటి?

తనవయసుకు సగానికి పైగా పెద్దవాడిని ప్రేమించటం,పెద్దలు కాదనటం,ఇంట్లొ బంధించటం...ఇదంతా ఏమిటసలు??


ఇలాంటి పొలంగట్టుల మీద,కాలవకట్టలమీద కనీసం మన పిల్లలు ఆడుకునే రోజులొస్తాయంటారా?


చందమామ పత్రిక పిల్లలకు పోటీలు నిర్వహించటం లో అంతరార్ధం పత్రికా ప్రచారమా?లేక పిల్లల్లో అవగాహన పెంచటమా??కానీ పూర్తిగా మహానగరాలను మాత్రమే ఈ పోటీలకు వేదికలుగా ఎంపికచేయటంలోని పరమార్ధం?





ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఇలాంటివాల్ పేపర్లు పైగా పరోక్షంగా మద్యపానానికి ప్రచారం చేసే వాటిని ప్రచురించవచ్చా?దీనివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా??





మహేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి ప్రచారానికొస్తాడా?ఒకవేళ వస్తే తప్పేమిటి?నందమూరి వారసులంతా తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి వస్తే కుటుంబమద్ధత్తు ఎందుకయ్యింది?అదే మహేష్ బాబు వస్తే పద్మాలయకు లాభం చేకూర్చే పని ఎలాఅయ్యింది?






కధారచయితలు తయారౌతారా?పుట్టుకొస్తారా?అవగాహనా సదస్సుల వల్ల సమకూరే లాభాలు??








తండ్రికి కొడుకే కాడెద్దు కావటమనే దైన్యస్తితి ఎందుకొచ్చింది?ఎలా తీరుతాయి మనరైతులకీ వెతలు?








కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ చిరంజీవి పార్టీకి పనిచేస్తాను..అంటున్న చేగొండి హరిరామజోగయ్య మాటలకు అసలు అర్ధముందా?ఉంటే ఏమిటని మీభావన?



















రాజమండ్రి పురపాలకసంఘం వారు,కందుకూరి వీరేశలింగంగారి భవనానికి ఇంకా పన్ను కట్టమని తాఖీదులు పంపుతున్నారు,ఆయన గురించి సదరు రా.పు.సం వారికి మీరు ఎలా జ్ఞానబోధ చేస్త్రారు?










పద్యకావ్యాలకు ప్రత్యేకంగా పోటీలు ..వీటివల్ల తెలుగుపద్యానికి,ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనముంటుందని మీరు భావిస్తున్నారా??

Tuesday, July 29, 2008

ఈరెండు దినపత్రికల్లో ఈలావు బూతులు

ఈరెండు దినపత్రికల్లో ఈలావు బూతులు ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ చూడలేదు నేను.యనభైల్లో యన్.టీ.ఆర్.ఎవడబ్బసొమ్మని అన్నందుకే గగ్గోలు పుట్టింది,మరి ఈ ప్రేలాపనలు ఏమిటి?అసలు వాగింది వాగినట్లు అచ్చంగా అలాగే ఇకనుంచి ఇస్తారేమో!!!???

ఆంధ్రజ్యోతి లో ఇలా.
ఈనాడు లో ఇలా,

ప్రజాశక్తి,


సాక్షి,

వార్త,
ఆంధ్రభూమి

Friday, July 25, 2008

ఇటీవల దీప్తిధార సి.బి.రావు గారు ఐ.టి పరిశ్రమలో దొంగ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాల్లో చేరటం,పట్టుపడటం గురించి మంచి చర్చను లేవనెత్తారు.నేను విశాఖపట్నంలో జరుగుతున్న ముఖ్యంగా యస్సీయస్టీ సర్టిఫికెట్లమీద కొందరు ఎలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికీ ఎట్లా సంపాదిస్తున్నారో చూడొచ్చు అని రాసాను.ఈ మధ్య ఒక్కరోజులో డ్రైవింగ్ లైసెన్సులు,రక్షణ రంగంలో,చివరకు భూమిపట్టాల కోసం ఎలా బోగస్ పట్టాలు సమర్పిస్తున్నారో ఈ వార్తల క్లిప్పింగుల ద్వారా చూడగలరు.






Monday, July 21, 2008

టీవీ నైనూ,మంద కౄష్ణా..ఇవి జరిగే పనులేనా అని!!!??

టీవీ నైనూ,మంద కౄష్ణా..ఇవి జరిగే పనులేనా అని!!!??




ఇక ఈ సంబడమేదో చూడండి







Saturday, July 19, 2008

అశ్లీలం మరియూ సెన్సారు వారు,మరి ప్రేక్షకులూ,పాఠకులూ,బ్లాగర్లూ?
















Wednesday, June 25, 2008

ఆంధ్రజ్యోతి మీది దాడి మొదటిది కాదు,చివరిదీ కాదు..

అర్ధరాత్రి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు,మరిద్దరు జర్నలిస్టులను అరస్టు చెయ్యటం పట్ల నా నిరసనను తెలియజేస్తున్నాను.ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల
యోగక్షేమాలు గురించి,సాధకబాధకాల గురించి ఏర్పడిన అంతర్జాతీయసంఘం కమిటి
COMMITTE FOR THE CONCERNED JOURNALISTS,NEWYORK(http://www.concernedjournalists.org/) సభ్యుడిగా ఇటీవల కాలములో పాత్రికేయులపట్ల కొన్ని
సంస్థలు ,వ్యక్తులు జరుపుతున్న అరాచకాలు,దాడులను పరిశీలిస్తుంటే అధికారపార్టీ,ప్రతిపక్షపార్టీ అని ఎలాంటి తేడాలు లేకుండా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని అవగతమౌతుంది.కానీ,కర్ర ఉన్న వాడిదే బర్రె అన్నసామెత ఇక్కడ పరోక్షంగా అమలుతుంది.కాస్త నోరు గలవాడిమీదో,పెద్దమీడియా సంస్థలలోనో పనిచేసేవారి మీద జరిగే దాడుల పట్ల వివిధ సంఘాల,మీడియా ఖండనలు,నిరసనలు ఒకరకంగా ఉంటే బక్కబడుగు వ్యక్తులు,సంస్థల్లో పని చేసేవారికి ఆమాత్రం సానుభూతి,సహానుభూతి కరువౌతుంది.

ఉదాహరణకి నెల్లూరు జిల్లా ఉదయగిరి లో వార్త విలేఖరికి జీవనాధారమైన హోటలును కూల్చి వేసారు.కానీ రాష్ట్రస్థాయిలో దాదాపు ఎలాంటి మద్దతు లభించలేదు




తాజా గొడవకు మూలకారణమైన బాడుగనేతలు అన్న వార్తాంశం పై ఆంధ్రభూమి సంపాదకులు యం.వి.ఆర్.శాస్త్రి గారు తన సహజశైలిలో ఇలా స్పందించారు.


జనసామాన్యం లో అధికసంఖ్యాకులకు మీడియా సరైన ప్రాతినిధ్యం కల్పించటం లేదంటూ పొనుగోటికృపాకర్ మాదిగ ఇలా అంటున్నారు..


ఇక ఉత్తరాంధ్రలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అనబడు తెలుగు దేశం పార్టీ నేత వీరంగాలు ఇక్కడి జర్నలిస్టులకు కొత్తకాదు.ఇది ఇటీవలి వారి ఉగ్రరూపానికో ఉదాహరణ..












కొద్దిరోజుల క్రితం యన్టీవి విలేఖరి మీద జరిగిన దాడి గూర్చి పెద్దలు పెద్దగా స్పందించలేదు.అసలు జర్నలిస్టు నాయకులు ఏసందర్భం లో ఎలా స్పందిస్తారో అర్ధం కావటం లేదని జర్నలిస్టు మిత్రులు ఆక్రోశిస్తున్నారు.చూడాలి ఆంధ్రజ్యోతి,మంద కృష్ణమాదిగల వివాదం ఏ మలుపు తీసుకుంటుందో...



Tuesday, June 24, 2008

ఈవార్తను ఎవరైనా చదివారా?చదివినా స్పందించలేదా?







పాఠశాల,కళాశాలల స్థాయి లో తెలుగు విద్యాబోధనను విపరీతంగా ప్రభావితం చేసే ఈ వార్త 19 తేదీన ఆంధ్రభూమి దినపత్రిక ప్రచురించింది.మిగిలిన పత్రికల్లో ఎవరైనా ఇంతప్రాముఖ్యత కలిగిన వార్తను చూసుంటే తెలియజేయగలరు.

Monday, June 23, 2008

ఈనాడు,సాక్షి ఒక్కలాగే "ఆరేసాయి"



అయ్యా అదీ సంగతి.ఇవ్వాళ్టి ఈనాడు,సాక్షి దినపత్రికలు ఫెదరర్ వార్తను ఒక్కలాగా ఎలా ఆరేసాయో చూసారుగా!!!

Monday, May 26, 2008

ఇక్కడో చిన్న తమాషా ఉంది





ఇవ్వాళ్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక నవ్య పేజీలో విజయానికి మేము సైతం... శీర్షికన ఉపఎన్నికలలో పోటీచేస్తున్న కొందరు అభ్యర్ధుల భార్యల అభిప్రాయాలు,ఛాయాచిత్రాలు ప్రచురించింది.కానీ ఇక్కడో చిన్న తమాషా ఉంది,చెప్పండి చూద్దాం.

Saturday, May 24, 2008

చంద్రబాబు భూతవైద్యం

ఈ మధ్య ఆంధ్రజ్యోతి దినపత్రిక వరుసగా రెండు రోజులపాటు రెండు వార్తలు ప్రచురించింది.ఒకటి భూతవైద్యానికి,మరొకటి మూఢనమ్మకానికి సంబంధించింది,ఒక దాంట్లో భూతవైద్యం చేయించుకుంది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాగా,మూఢభక్తులు సాధారణ జనం.కానీ వారి న్యూస్ ప్రజంటేషన్ లోని వ్యత్యాసాన్ని కాస్త నిశితంగా చదివితే తప్ప అర్ధం చెసుకోలేము.ప్రయత్నించండి మీరూ...