Monday, March 24, 2008

నిందితులు ఎవరు??

మిలాదునబి,శుభశుక్రవారం(good Friday)హోలీ,రఘువరన్,శోభన్ బాబుల ఆకస్మిక మరణాలు,సాక్షి పత్రికావిష్కరణ,ఇలా ఎన్నెన్నో పర్వదినాలూ,దుర్దినాలమధ్య కూడా నామనసుని కలచివేస్తున్న సంఘటనను మీ అందరితో పంచుకుని మీ భావాలు తెలుసుకుందామని ఓ చిన్నప్రయత్నం.

లక్ష్మీ,రాంబాబు(అసలు పేర్లు కావు)ఇద్దరూ కూలీనాలీ చేసుకుని బ్రతికే కుటుంబాల వారు.విశాఖపట్నంలొ ఉన్న లక్షలాది మంది లాగానే బతుకు తెరువు కోసం ఎక్కడినుండో వచ్చిన వాళ్ళు.ఇద్దరూ భవననిర్మాణకూలీలుగా పనిచేస్తూ,ప్రేమించుకున్నారు.లక్ష్మి ఈక్రమంలో గర్భవతి అయ్యింది.ఇద్దరి కులాలూ ఒకటే కావటంతో పెద్దలు కూడా అభ్యంతరం పెట్టక పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారు.

పెళ్ళికూతురు లక్ష్మికి వేవిళ్ళు,వాంతులు,వంట్లో వికారం.పందిట్లో ఈ పిల్లెక్కడ వాంతి చేసుకుని,కడుపుతో ఉన్న పిల్లకు పెళ్ళా అంటారేమోనని భయపడ్డ పెద్దలు ఆ అమ్మాయిని ఒక నాటు వైద్యుడి దగ్గర తెచ్చిన మందులు వాడి,గర్భస్రావం అయ్యేలా ప్రయత్నించారు.ఒక వైపు పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్నాయి,మరో వైపు లక్ష్మికి రక్తస్రావం అవుతోంది.మనసులో ఆనందం,శారీరకంగా భరించలేని బాధతో ఆ చిన్నారితల్లి విలవిల్లాడింది.కళ్యాణం కక్కొచ్చినా ఆగదుగా..పెళ్ళిపీటల మీద పిల్లలిద్దరూ కూర్చున్నారు.పంతులుగారు మంత్రాలు చదువుతూనే ఉన్నాడు,శతమానం భవతీ అనబోతున్నాడు,ఈ లోపు పిలుపు రానే వచ్చింది,తిరిగి రాలేని చోటు నుంచి.పసుపు బట్టలతోనే,పెళ్ళిపీటలమీదే,భరించలేని ఆ నొప్పికి తట్టుకోలేని ఆ పిచ్చితల్లి ఒక నిస్సహాయ ఆర్తనాదం చేసి,కన్ను మూసింది.
ఇంతకూ లక్ష్మి వయసు 17సంవత్సరాలు కాగా,రాంబాబుకు 19.

పెద్దలారా చెప్పండి, ఇక్కడ తప్పెవరిది,ఆ అమాయకురాలు,పదిహేడేళ్ళకే ప్రేమలో పడి,గర్భవతయ్యి,
నాటు మందులకు ప్రాణాలు కోల్పోయిన ఈ ఉదంతంలో నిందితులు ఎవరు??గత బుధవారం విశాఖపట్నం లొ జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది.మీ తీర్పు చెప్పండి.

5 comments:

netizen నెటిజన్ said...

చుట్టు ఉన్న సంఘం

వింజమూరి విజయకుమార్ said...

తప్పు ఆయా వ్యక్తులది కాదు. ఇక్కడ తప్పు illiteracy దీ,చదువుకోకపోవడందీ, నాటు వైద్యాలకి, బొప్పాయి పండ్లకీ గర్భం పోతుందనే అజ్ఞానానిది. దాన్ని పోగొట్టలేని ప్రభుత్వాలదీనూ.

Ramani Rao said...

1.నిందుతులు: పెద్దలు , ఇలా అని తెలిసి, నాటు వైద్యం అంటూ పసి పిల్లల ప్రాణాలు తీసే పెద్దలది తప్పు .
2. తెలిసి తెలియని ఆకర్షణది తప్పు .
3. చూస్తు కూడా ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వున్న మనందరిది తప్పు .

chandramouli said...

నా సమాధానం కొద్దిగా మానవతావిహీనమాయి ఉండొచ్చు కానీ ఇది నిజం..
తప్పు ఎవరిదీ అంటే ? నేను ఆ చనిపోయిన పిల్లలది అంటాను....

"చీకట్లో తప్పు" చెయ్యటానికి సాహసం తెలివి ధైర్యం తోబాటు సొంత ఆలోచనలు చేసుకున్న వీళ్ళను అమాయకులు అంటే నిజంగా అది మన అవివేకం, సంప్రదాయబద్ద పెళ్లి, పరువు కోసం ప్రాణాల మీదకు కావాలనే తెచుకున్నారు .... అంటే అన్నీ తెలిసే జరిగాయి కానీ అజ్ఞానం కాదు, అమాయకత్వం కాదు .... అన్ని తెలిసినవాళ్ళకు, ప్రాణాలమీదకు వస్తుంది అని, అలా నాటు పద్దతిలో గర్భస్రావం జరిగి చనిపోయినవాళ్ళను మనకంటే వాళ్ళే ఎక్కువ చూసివుంటారు... ఏదో సమజాం పరువు వంకాయ్ అని ప్రాణాలతో ఆడిన ఆట ... మరొక్క విషయం తప్పు చేసేప్పుడు లేని పద్దతి సంప్రదాయం పెళ్ళికి కావలనుకోవటం కేవలం పరువుకోసం పాకులాట అన బడే మూర్ఖత్వం కానీ అమాయకత్వం కాదు . చీకట్లో వున్నా ధైర్యం, వాళ్ళ తల్లి తండ్రి నాటుమందు గొంతులో పోసేప్పుడు లేదు అంటారా ... పరువు కోసం కొద్దిగా పాకులాట .. చిన్నవయసులో ప్రాణాలు పోవటంతో మన మనసు కొద్దిగా ద్రవిచటంతో ఇలా భాద వేస్తుంది తప్ప అక్కడ నిజంగా .. అక్కడ తప్పు ఎవరిదీ లేదు ... అది కేవలం మూర్ఖత్వపు ఆత్మాహత్య మరియు హత్య ...