Thursday, May 15, 2008

తెలుగు టీవీ ’ఛా’నళ్లపై ఒక మంచి కధనం

ఏమి జరిగిందో ఏమిటో తెలియదుగానీ ఇవ్వాళ(5/16/2008)ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో తెలుగు టీవీ ’ఛా’నళ్లపై ఒక మంచి కధనం ప్రచురించింది.కొందరు టీవీబాధితుల,నిపుణుల వాదనలు కూడా ఇచ్చింది.మన బ్లాగరులు కూడా యధాశక్తి తెలుగుటీవీచానళ్ళు మెరుగైన కార్యక్రమాలు ఎలా రూపిందించాలి అని తరచూ రాస్తున్నా అది ఆశించిన ఫలితాలనివ్వలేకపోతుంది.వీలయినంత త్వరలో అన్ని టీవీచానళ్ళ వారి ఇ-మెయిల్ అడ్రసులు ఇక్కడ ప్రచురిద్దాం.మన సూచనలు,సలహాలు,నిర్మాణాత్మకంగా వివరిద్దాం.










7 comments:

Chaks said...

చెత్త చానల్స్. వీళ్ళని ఆపాలంటే ప్రజల్లోనే ఒక విప్లవం లాంటిది రావాలేమో. ఇలాంటి నైతిక విలువల్లేని చానల్స్ ని చూడకూడదని ఆందరూ నిర్ణయించాలి. ప్రజల్లో కూడా బాధితులపట్ల సానుభూతి ఉండాలి, ఈ జనాలు పైకి మాత్రం బాగా మాట్లాడతారు లోపల్లోపల ఆ సీన్ లు ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుంటారు. ఇలాంటి చెత్త ని ప్రసారం చేసే ఒక్క చానల్స్ లైసెన్స్ తొలగిస్తే చాలు మళ్ళీ మరెవడూ ఇలాంటి పనులు చేయరు. డబ్బుకు గడ్డితినే అడ్డగాడిదల్లాంటి నాయకుల సపోర్టున్నంతవరకూ ఇలాంటి యాక్షన్ తీసుకునేదెవరు?

సుజాత వేల్పూరి said...

ఆ మధ్య చంద్రబాబు నాయుడు లోకేష్ వివాహ సందర్భంగా మీడియా అత్యుత్సాహాన్ని గురించి మాట్లాడుతూ మీడియా స్వేచ్చకు పరిమితులుండాలంటే,TV9 అప్పటికప్పుడే 'మీడియా స్వేచ్చకు పరిమితులుండాలా వద్దా' అని 30 మినిట్స్ కార్యక్రమం రూపొందించి ప్రసారం చేసింది. ఈ చానల్ కి వారికనుగుణంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే కొందరు ప్రముఖులు రెడీగా ఉంటారు. వారు ' అవును, తప్పేముంది, శుభకార్యం కవర్ చేయడంలో తప్పేం లేద ' ని సెలవిచ్చారు. వ్యక్తులు ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళే హక్కు మీడియాకుందా అనే ప్రశ్నను skip చేసారు ఈ ప్రోగ్రాం లో!

ఒక ప్రముఖ వార్తా చానల్ ' ముందుగా వార్తను అందించాలన్నా కీర్తి కండూతితోనూ, సంచలనాలు సృష్టించాలన్న దురద తోనూ చాలా అమానుషమైన పనులు చేస్తోందని ముఖేష్ విషయంలో తేలింది. PJR గుండె పోటుతో హాస్పిటల్ లో మరణించారని వార్త అందగానే, న్యూస్ రీడర్ సంఘటనా స్థలిలో ఉన్న రిపోర్టర్ ని ' ఆయన ఆహార అలవాట్ల గురించి కుటుంబసభ్యులని అడిగి చూడండి, ఫాట్ ఎక్కువగా తీసుకుంటారా " అని అడిగిందంటే వీళ్ల వ్యాపార దృక్పథం ఎంత స్థాయిలో ఉందో ఊహించండి! ఆ సమయంలో అడిగే ప్రశ్నా అది?

ఇటీవల ఏర్పడిన పోటీ కారణంగా సమ్యమనం పాటించే స్థితిలో అసంఖ్యాక చానళ్ళు లేవు.అందువల్ల వీరి పైన తప్పకుండా కంట్రోల్ అవసరమే! fourth estate గా ప్రజాస్వామ్యానికి దన్నుగా నిల్వాల్సిన మీడియా వ్యక్తుల ప్రైవేట్ జీవితాల్లోకి చొచ్చుకుపోకుండా ఆపే చట్టబద్ధ మైన ఆయుధం ఒకటి ఉండాలి! వారి వల్ల నష్టపోయిన సామాన్య (నష్టం మానసికమైనా సరే) ప్రజలకు భారీ నష్ట పరిహారాన్ని ఇప్పించేదిగా ఉంటే, కొంచెమైనా ఇవి దారిలోకొస్తాయేమో చూడాలి. దీని మీద విస్తృతంగా చర్చ జరగాలి.

పద్మనాభం దూర్వాసుల said...

ఏ దుర్ఘటనలోనో ఆసుపత్రిపాలై చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని ముఖంపై మైకు పెట్టి ఇంటర్వూలు చెయ్యటం ఒకటి మహా దారుణం.వీళ్ళని ఆసుపత్రివాళ్లూ, పోలీసులు ఎలా అనుమతిస్తారో తెలీదు. కొన్ని టివి చానల్స్ వాళ్ళు బ్లాక్ మెయిలు చేసి డబ్బులు గుంజుతున్నారని విన్నాను. దబ్బులు ఇవ్వకపోతే వాళ్ళపై ఏవో కథనాలు టివిలో చూపెడతామని బెదరిస్తున్నారని కూడా వింటున్నాం.
వీటిపై నియంత్రణ లేదా!

దూర్వాసుల పద్మనాభం

Yavan said...

ఇంతకుముందు పోలీసువాళ్ళు అంటేనే భయం కల్గేది, ఇప్పుడు మీడియా అంటే కూడ భయం వేస్తున్నది

krishna rao jallipalli said...

ఈ లోకం లో ... అడ్డ దార్లలో డబ్బు, పేరు, కీర్తి సంపాయించడానికి ఒక్కో నా కొడుకు ఒక్కో వేషం వేస్తాడు. ఒక్కో లంజ/లంజా కొడుకు ఒక్కో దారి తోక్కుతుంటాడు. వీళ్ళు అంతే. ఈ కొజ్జా నా కొడుకులు అందుకు మినహాయింపు ఏమి కాదు. ఒక్కో టైములో ఒక్కో నా కొడుకులు హవా .. అంతే. నా కొడుకులు కి ఎవరు ఎన్ని, ఎంత చెప్పినా మారరు.

krishna rao jallipalli said...

please publish my NON-VEG. COMMENT

netizen నెటిజన్ said...

1 - http://netijen.blogspot.com/2007/08/blog-post_19.html
2 - http://netijen.blogspot.com/2007/08/blog-post_28.html
3 - http://netijen.blogspot.com/2007/09/blog-post_28.html