Thursday, December 6, 2007

చర్చావేదిక


చర్చావేదికకు స్వాగతం.వృత్తివ్యాపకాల్లో క్షణం ఖాళీ లేకుండా గడిపే మీఅందరికీ,తెలుగుభాషను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మీరు చేస్తున్న కృషినీ అభినందిస్తూ ఈ చర్చావేదికలోకి అహ్వానిస్తున్నాను.ఎవరి బ్లాగులు వారివిగా మిగిలిపోతూ రచయితలకూ,కామెంట్లు చేసే వారికి మాత్రమే పరిమితమయి పోతున్న సమయంలో ఈ చర్చా వేదిక భిన్నాంశాలను,ప్రస్తావిస్తూ,చర్చిస్తూ,ఎక్కువమందికి అమోదయోగ్యమైన, ఆచరణకు అనుకూలమయిన పరిష్కారాలను కనుగొనే దిశగా పయనిస్తుంది.ఇక్కడ ఎవరయినా ఒక అంశాన్ని ప్రస్తావించొచ్చు,వ్యాఖ్యానించొచ్చు.కానీ వ్యక్తిగతదూషణలూ,కులమతప్రాంతీయ,భాషా వైషమ్యాలను ప్రేరేపించేవిగా ఉండకూడదు. అనానిమస్ అనే ముసుగుమనుషుల వ్యాఖ్యానాలు ఇక్కడ అనుమతించబడవు.
రండి,ప్రవహించండి జీవనదిలా,ప్రాణవాయువులా,పచ్చనిపైరు లా,నులివెచ్చని నెగడులా, అందరిపై కప్పు ఆకాశంలా....

5 comments:

cbrao said...

రాజేంద్రా! ఇదిగో తొలి చర్చనీయాంశం.
బ్లాగులు చదివేది,కామెంట్లు రాసేది తోటి బ్లాగరులే కాని,పాఠకులు కాదు.Anonymous గా వ్యాఖ్యలు రాసేది కూడా బ్లాగరులే.Popularity కోసం వారి టపాలపై,వారే వ్యాఖ్యలు రాసేది బ్లాగరులే.బ్లాగు ప్రజలకు చేరటం లో విఫలమయ్యింది.

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

పైన పెద్దాయన చెప్పిన "బ్లాగులు చదివేది,..." అనే విషయాన్ని సంపూర్తి గా వ్యతిరేకిస్తున్నా. మిగిలిన విషయం లో ఆయనికి బాగానే అనుభవం ఉన్నట్లుంది కాబట్టి నిజమే అయి ఉండవచ్చు.

బ్లాగులు ఇన్ని ఉన్నా చెప్పుకో దగినవి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. చెప్పుకో దగిన వాటిని మినహాయిస్తే.., మిగిలిన వాళ్లకి కీర్తి కండూతి, హిట్టా ఫట్టా మీద ఉన్న ధ్యాస తెలుగు మీద కనపడదు. వ్రాసే దాని మీద నిజాయితీ కనపడదు. గుంపు గా తయారయ్యి వాళ్ళలో వాళ్ళ ఇహ ఇహలు పక పక లు తప్ప.., ఎవరైనా మంచి అంశం మీద వ్రాస్తే దానికి కనీస స్పందన ఉండదు... ప్రత్యకంగా ఆ వీర బ్లాగు గుంపు నుంచి... అయితే అది వాళ్ళ ఇష్టం . తెలుగులో వ్రాస్తున్నారు కాబట్టి అభినందించ వలసినదే వాళ్ళని...
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే.., వాతావరణం ఇలా వెగటు గా ఉన్నపుడు క్రొత్త పాఠకులను ఆకర్షించడం ఉన్నవాళ్ళని నిలబెట్టుకోవటం అసంభవం అని..

బ్లాగు, బ్లాగు లాగ ఉండాలి. బ్లాగు వ్యక్తిగతమే అయినప్పటికీ నలుగురూ చదువుతారు కాబట్టి ఆ ఇంగితం తో వ్రాయాలి... వ్రాసిన తర్వాత ఎవడో ఏదో అన్నాడంటే లాభం లేదు.., సమయం ఉన్నపుడు వరుసగా చదువుకుంటూ పోతాం.., బాగుందను కుంటే ఎవడ్రా బాగా రాసాడు అనుకుని కొంచెం వ్యక్తిగత వివరాలు కూడ తెలుకుని మళ్ళీ పోస్టు వచ్చినపుడు ఉత్సుకత చూపి చదువుతాం.., అదే నచ్చకపోయినా వ్యక్తిగత వివరాలు తెలుసుకుని చచ్చినా ఈ బ్లాగు మొఖం చూడకూడదనుకుంటాం... చదివేవాడికి వ్రాసేవాడికున్నంత సమయం ఉండకపోవచ్చు... చదువు కుంటూ పోతాడంతే... అక్కడక్కడా బ్రేకులు వేసుకుంటూ...బ్లాగు మీద, బ్లాగు వ్రాసిన వాడిమీద, వ్యాఖ్య ల మీద వ్యాఖ్య వ్రాసిన వాడిమీద అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఏర్పరచుకున్నవాటిని సవరించుకుంటూ...

బ్లాగు అనేది నిజాయితీ గా ఉండాలి.., వ్రాసేవాడు చదివేవాడిని లోకువ గా చూడకూడదు...మరీ ముఖ్యంగా బ్లాగు విషయంలో... ఇప్పుడే ఒకాయన వ్యాఖ్య చూసా..., ఆయన వ్రాసిన వాటిని ఆయన అంచనాలకు తగ్గట్టుగా ఎవరూ చదివి పొగటం లేదట...అయ్యా మీరు స్వాతి లోనే వ్రాయండి..50లక్షల నుంచి కోటి కి చేరటం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టండి.., వ్యాపారం కోసమూ వ్యక్తి గత ప్రతిష్ట పెంచుకోవటం కోసం బ్లాగును వాడుకుందామనుకుంటే ఆ పప్పులు ఉడికే పరిస్థితి ఇక్కడ ఉందనుకోను...

braahmii said...
This comment has been removed by a blog administrator.
cbrao said...

తాడేపల్లి గారి చర్చాంశం వ్యవసాయం. రైతులు పండిన పంటను రక్షించుకోటానికి( పురుగుల, ప్రకృతి వైపరీత్యాల నుండి), వాటిని అమ్ముదామంటే సరైన గిట్తుబాటు ధర (ప్రభుత్వ మిచ్చేది మద్ధతు ధర మాత్రమే) రాక తీవ్రమైన సమస్యలకు లోనవుతున్నారు.బ్లాగరు తను రాసిన టపాలు, బ్లాగులకు తగినంత ప్రాచుర్యం లేనందువలన,పాఠకులకు చేరక, తగిన స్పందన రాకపోవటం వలన కొంత నిరాశ కు లోను అవుతున్నది వాస్తవమే. బ్లాగరు యొక్క ఈ నిస్పృహ ను ఎలా తగ్గించటం?

వింజమూరి విజయకుమార్ said...

రాజ మల్లేశ్వర్ గారికి,

తెలుగు సాహిత్యం, సంస్కృతులతో పరిచయమున్న వ్వక్తికి నాకు తెలిసినంత వరకూ మాట్లాడినా, రాసినా ఒక విధమైన గౌరవం అలవడుతుంది. వ్రాసేవాడు, చదివేవాడు బదులుగా వ్రాసేవారు, చిదివేవారు అంటే మన సంస్కారమే ప్రస్పుటమవుతుంది గానీ, వేరొండు గాదు. అయినా మీరు ఎవరిని పొగిడారో ఎవరిని తిట్టారో, అసలేం చెప్పారో స్పష్టత లేదు. ఇక విషయం బ్లాగుల పఠనీయత ఎలా పెంచాలా అనేది. అది మీరు ఒక్క ముక్కా రాయలేదు. నిజమే మీరన్నట్టు స్యాతిలోనో, ఈనాడు దినపత్రిక వ్యాసాల పేజీలోనో రాయగల శక్తి వున్నవారికి బ్లాగు కొంత అసంతృప్తిని కలుగజేస్తుంది. అయినా నేను రెగ్యులర్ గానే రాస్తున్నాను. పైగా మీరేదో అన్నారు నాకు పాఠకులు, వ్యాఖ్యలు లేవని. ఆ మాట నాది కాదు. నా బ్లాగుకి చక్కటి పఠనీయత వుంది. వ్యాఖ్యలూ వున్నాయి. వ్యాఖ్యల కోసం కక్కుర్తి పడే రకమైతే నేను జీనో పేరడాక్సులు గురించి బ్లాగులో రాసివుండను. ఏ చిరంజీవి సినిమా గురించో, అనుష్క వంపు సొంపుల గురించో రాసి హిట్లు, వ్యాఖ్యలు బాగానే తెప్పించుకోలను. మీరింకేదో అన్నారు బ్లాగర్లు గ్రూపులుగా ఏర్పడ్డారని. ఎవరు గ్రూపయితే మనకెందుకండీ. మీరు హుందాగా బ్లాగు రాయండి. మీ పాఠకులు మీకుంటారు. నేను హుందాగా బ్లాగు రాసినంత కాలం బ్లాగ్లోకం నన్ను మెచ్చింది. అలాగే సరసమైన కథలు రాసినా నన్ను మన్నించింది. ఇంతకీ గ్రూపులూ, వ్యక్తులూ గురించి మాని బ్లాగులకి పఠనీయత పెంచే విషయం ఆలోచించగలరు.