Thursday, December 6, 2007

ఔనేమో?కాదంటారా?







పెద్దలు,దీప్తిధార సిబిరావు గారు ---"బ్లాగులు చదివేది,కామెంట్లు రాసేది తోటి బ్లాగరులే కాని,పాఠకులు కాదు.Anonymous గా వ్యాఖ్యలు రాసేది కూడా బ్లాగరులే.Popularity కోసం వారి టపాలపై,వారే వ్యాఖ్యలు రాసేది బ్లాగరులే.బ్లాగు ప్రజలకు చేరటం లో విఫలమయ్యింది" అంటున్నారు.వారి వాదనలో నిజముందా?పాపులారిటి కోసం పాకులాడటం వల్ల బ్లాగర్లకు వచ్చే ప్రయోజనాలేమయినా ఉన్నాయా?బ్లాగు ఒక సమచార సాధనంగా ప్రజలకు చేరటంలో విఫలమయ్యిందనే రావు గారి మాటల్లో నిజమెంత?మన దేశాని సంబంధించి బ్లాగులవర్తమానం,భవిష్యత్తు ఎలా ఉంది,ఉండబోతుంది?తెలియచేయండి.

4 comments:

వింజమూరి విజయకుమార్ said...

నిజమే. బ్లాగర్లకు యితర బ్లాగర్ల గురించి తెలిసేది కూడా అగ్రిగేటర్ ల మూలంగానే. అది ఎంతైనా పరిమితమైనదే అయింది. బయటవారు అంటే అగ్రిగేటర్ ల గురించి తెలిసినవారు కూడా చదువగలరు. అదీ కొద్దిమందికే తెలుసనుకుంటా. అదే ఒకరోజు 'ఈనాడు' దినపత్రికలో 'శోధన' సుదాకర్ బ్లాగ్ అడ్రస్ వచ్చిన నెలలో ఆయనకి నెలకి పదివేల హిట్లు వచ్చాయట. అదే ఈనాడులో నా 'అభినయని' బ్లాగు చిరునామా వచ్చిన రోజున నాకు ఒకరోజే 500 హిట్లు వచ్చాయి. అవి తర్వాత క్రమంగా తగ్గాయనుకోండి. ఏదైనా అగ్రిగేటర్లు బ్లాగ్లోకానికి టపాల గురించి తెలుపగలరు. బయట ప్రపంచానికి తెలియడానికి మనం మరో ప్రత్యామ్నాయం కనిపెట్టాల్సిందే. కానీ బ్లాగుల గురించి అసలు తెలీక చాలా మంది మన బ్లాగుల్ని చదవలేక పోతున్నారనేది చాలా పెద్ద వాస్తవం. ఎందుకంటే నాకే చాలా సార్లు అన్పించింది. ఈ కొద్దిమంది కోసమా నేను కష్టపడి రాస్తున్నది అదే 'స్వాతి' పత్రికలో రాసుంటే కోటిమంది కాకపోయినా కనీసం యాభై లక్షల మందైనా చదివి వుండేవారు కదా అని. అలాగే ఈ బ్లాగు రాయడం కోసం నేను వెచ్చించిన సమయాన్ని ఏ 'లో బడ్జ్ ట్ సినిమా'కో చక్కని కథ మలచడంలో వెచ్చించి వుంటే డబ్బో పేరో వచ్చుండేవి కదా అని. ఎందుకంటే నాకు సినిమా స్కిప్టు మీద కూడా అవగాహన వుంది. మొత్తానికి బ్లాగులకి రీడబిలిటి తక్కువే మిగతా వారేమంటారో గానీ. ఆ కొద్దిపాటి రీడబిలిటీ కూడా అగ్రిగేటర్ ల మూలంగా వచ్చిందే.

braahmii said...

విషయం బాగుంది, బ్లాగు విఫలమయిందా లేదా అన్నది అది కలిగించే ప్రయోజనం మీద ఆధారపడి నిర్ణయించాలి. ఒక పాశ్చాత్య ప్రముఖుడు ప్రచురణ కోసం రచన పంపించమని అడిగితే, బూదరాజు రాధాకృష్ణ ఒక వ్యాఖ్య రాసుకున్నారు తన జీవిత చరిత్ర "విన్నంత కన్నంత"లో. "మహా కావ్యాలు అంతరించిన ప్రపంచంలో క్షుద్ర రచనలకు ప్రాముఖ్యముంటుందనుకోవటం భ్రమ.కాకపోతే వెర్రి" అని. బ్లాగులన్నవి మనలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించినంత కాలం కొనసాగించటం ప్రయోజనకరం.జ్ఞానాన్ని నలుదెసలా విరజిమ్మాలనుకోవటం భావిలో దుఃఖం కలిగిస్తుంది. పాత్రతను బట్టి దేవుడు ప్రాప్తి కలిగిస్తాడు. నేను ఇదే పని ఇంకోచోట చేస్తే ఎంతో బావుండేదనుకోవటం మరింత మనఃక్లేశం కలిగిస్తుంది. మనం ఏది చేసినా బ్లాగులయినా మరొకటయినా ఆత్మానందం కోసం చేయటం మంచిది. అది ఎక్కడ ఎలా లభిస్తే అలా పొందటాన్ని మించిన భాగ్యం లేదు. బ్లాగులన్నవి మనలో కలుగుతున్న అభిప్రాయాలను నలుగురితో చర్చించి సరిదిద్దుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. గొప్ప గొప్ప రచనలను ప్రదర్శించే తాడేపల్లి లలితా బాలా సుబ్రహ్మణ్యం గారు గాని, కొత్తపాళి గారు గాని, అలాంటి ఇంకొందరు పెద్దలు గాని బ్లాగులను బతికించాలని రచనలు చేస్తారనుకోను. వారి రచన లోని గొప్పదనమే వారి బ్లాగులకు పాఠకులను తీసుకువెళుతుంది. రచన కూడా అక్షరమే. అది వెంటనే ఉద్దేశించిన ప్రయోజనం కలిగించక పోవచ్చు. కాని సమయం వచ్చినప్పుడు దాని ప్రభావం బయట పడుతుంది. అచ్చు యంత్రాలు లేకపోయినా వేల సంవత్సరాలుగా నిలిచిన సాహిత్యం మన కళ్ళ ఎదురుగానే ఉంది. ఎంత అందంగా ప్రచురించినా, ఎంత ఉచితంగా (ఊరికినే) ఇచ్చినా నిమిషాల్లోనే చెత్త బుట్టలోకి వెళ్ళిపోయే రచనలూ మన కళ్ళ ఎదురుగానే వున్నయి.
బాలవాక్కు

braahmii said...

ఇది కూడా చూడండి, నాకు నచ్చింది..
http://www.tadepally.com/2007/12/blog-post.html#c8414017570508687738


బాలవాక్కు

వింజమూరి విజయకుమార్ said...

braahmii గారూ.

అంతా బాగానే చెప్పారు గానీ ఇక్కడ విషయం బ్లాగుల పరిమితమైన పఠనీయత గురించి. పరిమితమైన దాన్ని విస్తృత పరచడం గురించి. నేనిప్పుడు నా బ్లాగుకి పఠనీయత లేదనలేదు. మీరు చెప్పిన వారికి మల్లే నా టపాలకోసం ఎదురుచూస్తూ వెదుక్కునే పాఠకులూ లేకపోలేదు. ఎంతో శక్తిని వెచ్చించి కష్టపడి రాసిన రచన కాస్త ఎక్కువ మంది చదవాలనుకోవడంలో తప్పు లేదనుకుంటా(కావాలంటే మీరు నా బ్లాగులో 'మహాపరాధి' కథ చూసి చెప్పండి. కష్టం అని ఎందుకన్నానో తెలుస్తుంది). మీరు చెప్పిన వారిలో తాడేపల్లి గారి 'చిన్న కమతాల రైతులు' తరహా రచనలు బావుంటాయి. గౌరవింపబడతాయి కూడా. మిగిలినవి కొన్ని ఆయన వ్యక్తిగత విశ్వాసాలు గానో నమ్మకాలు గానో వుంటున్నాయి. ఇక కొత్తపాళీ గారు కాజువల్ గా రాయడమేగానీ సీరియస్ గా రాస్తున్నట్టు నాకు తోచదు. ఏదైనా మీరు మనకి ఆత్మానందం కలిగేచోట రాసుకోమనడం బాగానే వుంది గానీ, బ్లాగుల పఠనీయత పెరిగే మార్గం వైపు దృష్టి మరల్చకపోవడం బాధాకరం.