Wednesday, December 26, 2007

సొంత పేరుతో రాయాలా ?


వివిధ బ్లాగులపైన మన అభిప్రాయాలను రాయడం మన
సొంత పేరుతో రాయాలా లేదా ఏ మారు
పేరుతోనైనా
రాయవచ్చునా?
నిజానికి మారు పేరుతో రచనలు చేయడం, సొంత పేరుతో రచనలు
చేయడం ఒకప్పుడు పెద్ద చర్చనీయాంశం. మరి ఉత్తరాలు రాసేవారి సంగతి? విషయం
ముఖ్యమా? వ్యక్తి ముఖ్యమా? కొ.కు, రావిశాస్త్రి తదితరులు మారుపేర్లతో రచనలు
చేసిన సంగతి తెలిసిందే. వివేకనందుడు దేశమంతా నాలుగైదు సార్లు రకరకాల పేర్లతో
తిరిగేవారు. చికాగో వెళ్లేముందర క్షేత్రి మహరాజు వివేకానంద పేరు ఖాయం చేసిన
సంగతి మీ అందరికీ తెలిసిందే. చెప్పండి. పేరు ముఖ్యమా? బ్లాగులకు ఏదో విధంగా
స్పందించడం అనే అలవాటు పెంపొందిచడం ముఖ్యమా?
- దుప్పల రవికుమార్


http://sameekshaclub.wordpress.com

5 comments:

GKK said...

మారు పేర్లతో వ్రాయటం తప్పులేదు. అనామకుడిగా ఉండటంలో ఒక సౌలభ్యం ఉంది. అయితే విమర్శలు శృతి మించకూడదు. వ్యాఖ్య లోని విషయం చూడండి. ఎవరు వ్రాస్తేనేం.

చదువరి said...

ఎలాగూ చర్చకొచ్చింది కాబట్టి రాసేస్తున్నాను.

సద్విమర్శ చేస్తే ఏ పేరు పెట్టుకున్నా అసలు పెట్టుకోకపోయినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ...

ఈ అనామకంగా రాసేవాళ్ళూ, ఒకటి కంటే ఎక్కువ పేర్లతో రాసేవాళ్ళూ (ఉన్నారు!!) సాధారణంగా సద్విమర్శలు చెయ్యరనేది నేను గమనించినది.

అనామక వ్యాఖ్యలు అవాంఛనీయమే కాకపోతే బ్లాగరు సాఫ్టువేరులో వారికి అనుమతి నిరాకరించే సౌకర్యమే ఉండేది కాదు.

కాబట్టి ఎక్కువ మంది అజ్ఞాత వ్యాఖ్యాతలు అనామకాసురులే గానీ శుభం పలికే వారేమీ కాదు. (ఎక్కువ మంది అని ఎందుకంటున్నానంటే ఎవరో కొంతమంది మంచివారు ఉన్నారని కాదు.., ఉండే అవకాశం ఉందని.) అంచేత అనామక వ్యాఖ్యాతలు అవాంఛనీయమే!

ఇలా దాక్కుని తిట్టు కవిత్వం చెప్పేవారిని ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉందని నా ఉద్దేశ్యం. బ్లాగరులంతా కలిస్తే అది సాధ్యమేమో నని అనుకుంటున్నాను. ఎక్కడో ఒకచోట (ఉదాహరణకు etelugu.org) దొంగల ఐపీల జాబితా (వాంటెడ్ లిస్టన్న మాట) పెడదాం. దొంగ వ్యాఖ్యాతలు ఏ బ్లాగులోనైనా నోరు చేసుకున్నపుడు సదరు బ్లాగరి ఆ దొంగ ఐపీఅడ్రసును ఆ జాబితాలోకి చేరుస్తాడు. అది మిగతా వారికి ఉపయోగ పడొచ్చు. మరొక్కటి..

ఈ జాబితా వలన మరో ఉపయోగం కూడా ఉంది.. జెకిల్ పేరుతో పబ్లిగ్గా చలామణీ అవుతూ హైడ్ పేరుతో చీకట్లో తిరుగుతూ నోరు చేసుకుంటూ ఉండే నెజ్జనులను కూడా గుర్తు పట్టొచ్చు.

రాధిక said...

మిగతా వాళ్ల గురించి నాకు తెలియదుగానీ నా బ్లాగులో చాలా అనామక వ్యాఖ్యలు నా స్నేహితులు రాసినవే.నా బ్లాగులో ఏదో ఒక కామెంటు పెట్టాలని అనామకులుగా[లాగిన్ ఐడీలు లేక],లేకపోతే వారి పేర్లతో చిన్న చిన్న కామెంట్లు రాస్తూ వుంటారు. అలాగే నా బ్లాగు చాలా ఫారంస్ లో కనిపిస్తూవుంటుంది.అక్కడి నుండి వచ్చే జనాలలో కొంతమంది వ్యాఖ్యలు రాస్తుంటారు.[సైట్ మీటర్ లో రిఫరల్ యు ఆరెల్ బట్టి తెలుస్తుంది]వీరికి కూడా లాగిన్ ఐడిలు లేకనే అనామకులుగా రాస్తుంటారు.నా సైట్ మీటర్ ద్వారా ఈ విషయాలు తెలుసుకోగలిగాను.విమర్శిస్తూ,తిడుతూ కూడా చాలా వ్యాఖ్యలు వచ్చాయి.అవి అన్నీ అనామక వ్యాఖ్యలే.వీరి వద్ద నా సైటు మీటర్ పని చెయ్యట్లేదు.వీరిని ట్రాక్ చేద్దామంటే "అన్ నోన్"అనే చూపిస్తూ వుంటుంది.

krishna rao jallipalli said...

రాసే దానిలొ సరకు ఉంటే ఏ పీరుతొ రాసినా ఫర్వలెదు.

సూర్యుడు said...

strangely, I missed this post, I have seen this on koodali for a very short time, after that it was disappeared. I thought that the post was withdrawn, thank God, it is still there for me add my two paise ;)

I would not say, my stand on this issue is known to the universe ;) but I would support anonymous comments. It is a way to encourage people to provide what they think irrespective who they are ;)

Here, I have a point to Sri chaduvari gaaru ...

I think, I have given my first comment in Telugu blog to your post only. Ihave been observing since then, you have the habit of loosing control over the comments. I did not understand your point on "good comments", I understand it as the ones (comments) you like. It is not possible always.

I also understand that there is fear here that a known person is coming in a different form (with a different name). It is absolutely possible but you can't do anything about it. That is the specialty of the electronic media ;)

BTW, I don't know what is your real name, obviously chaduvari is not your real name. How come a sUruDu is different from chaduvari? Both of them are nicknames ;)

~ sUryuDu ;)