Sunday, January 6, 2008

ఎవరు బ్లాగులు రాయాలి, ఎవరు మానాలి


నాబ్లాగుకు నేను ఆశించిన స్థాయిలో కాక పోయినా కనీస స్పందన రావట్లేదు. బ్లాగులోని టపాలను చదువుతున్నారని తెలుస్తున్నా వారి వ్యాఖ్యానాలు లేక కామెంట్లు వచ్చినప్పుడే కదా మనకు వారి అభిప్రాయాలు తెలిసేది?


చదవాలి అనిపించిన బ్లాగులు చదువుతాము, స్పందన ఆటపాను చదవగానే కలగాలి అంతే గానీ, తెచ్చిపెట్టుకునే వ్యాఖ్యలు ఎందుకు రాయాలి?


పైన రెండు వాక్యాలు ఒకరితో ఇంకొకరు చేసుకున్న సంవాదం లా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ దురదృష్టవశాత్తూ కొందరు కొన్ని సార్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అవి. మనం అద్భుతంగా రాస్తాం, ఎంతో సహజంఅది, పాఠకులు వెంటనే స్పందించి కామెంట్లు రాయాలి కానీ రాయట్లేదు.


అలాగే మనంఏ కూడలికో, జల్లెడకో వెళ్ళి బ్లాగులు చూస్తాము, కామెంట్లు రాద్దామనే ఉదారమైన సదుద్దేశం కూడా ఉంది మనకు కానీ ఏబ్బే ఏది చూసినా హృదయం స్పందించటంలేదు, తెచ్చి పెట్టుకున్న వ్యాఖ్యలు రాస్తే ఏంబావుంటుంది?


అసలు ఎందుకు రాస్తాము ? ఇదో మౌలికమైన ప్రశ్న దానికి తేలిక సమాధానం బ్లాగు మనది కాబట్టి, అందరూ చూడాలనేగా అవును, చూస్తున్నారా? అవును, మరి ఇంకేమిటి కొరత ఇక్కడకు వచ్చేసరికి సమాధానాల కొరత ఎదురవుతోంది.


అయ్యలారా, అమ్మలారా నేను ఎంతో కష్టపడి ఒక బ్లాగు నడుపుతున్నాను, మంచి సమాచారం తో తరచూ కొన్ని అంశాల మీద రాస్తున్నాను, మీరు చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తే సంతోషిస్తాను అని చెప్పుకోవటానికీ, నేను బాగా రాస్తాను, కానీ మీరే ఏమీ స్పందించట్లేదు , నేను ఎందుకు కామెంట్లు రాయట్లేదు అంటే మంచి వ్యాసాలు చూసి తక్షణం మనకు కామెంటు రాయాలి అనిపించాలి, నేను మీ రచనలు చూసి అలా ఫీల్ కాలేకపోతున్నాను కాబట్టి రాయట్లేదు గానీ, వేరే ఉద్దెశం ఏమీ లేదు అంటే ఎలా ఉంటుందో కనీసం అ ఆ లు చదవగలిగిన వాళ్ళు అందరూ అర్ధం చేసుకోగలరు.


సమకాలీన సమాచార, ప్రసార సాధనాలు అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఇంటర్నెట్ అనే మహావ్యవస్తలో అన్నిటికంటే, రెండంచుల కత్తి లాగా టూ వే కమ్యూనికేషన్‌ కు, పైగా తక్షణం అవతలి వారి మనోభావాలను తెలుసుకునే వీలున్న బ్లాగుల రచనను వేళాకోళంగా చూసే వారిని చూసి మనం జాలీ, సానుభూతి చూపటం తప్ప ఇంకేమన్నా చేయగలమా? నేను ఊక తెస్తాను, నువ్వు పప్పులు పట్టుకురా రెండూ కలిపి ఊదుకుని తిందామన్నారట ఎవరో వెనకటికి.


నా కామెంటు ఎంతో అమూల్యం, అంత సులభంగా అన్నిటికీ రాయను అని నేను అనుకుంటున్నట్లే, అందరూ అదే విధంగా భావిస్తారు అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు ఇంకొకరిని కించపరిచే విధంగా ఎవరూ రాయరు. బ్లాగుల సంఖ్య పెరగటంవల్ల కామెంట్లు రాయలేక పోతున్నాము అనే వాదన కూడా అసమగ్రముగా ఉంది. 1997 లో మొదట ప్రాచుర్యం లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా బ్లాగుల సంఖ్య వందల, వేలరెట్లు పెరిగింది, పెరుగుతూనే ఉంటుంది. సమాచార విస్ఫోటనం ఒకరు ఆపితే ఆగేది కాదు, ఆపలేరు కూడా. పోనీ ఎన్ని బ్లాగులుంటే బాగుంటుంది? అప్పుడైనా అన్ని బ్లాగులకూ కామెంట్లు వస్తాయా అనేది ఎవరైనా చెప్పగలరా? అలాగే ఎవరు బ్లాగులు రాయాలి, ఎవరు మానాలి అనే అంశం ఎవరు నిర్ణయిసారు. ఆనిర్ణయాన్ని ఎవరు శిరసావహిస్తారు? బ్లాగుల మీద ఒక నియంత్రణామండలి--కంట్రోలింగ్ బోర్డ్ ఉండాలని కోరుకుంటున్నారా?


రెండు మూడేళ్ళ క్రితంవరకూ అనామకంగా ఉన్న తెలుగుబ్లాగులు ఈరోజు ఎంత ప్రాముఖ్యం వహిస్తున్నాయో గ్రహించ లేని వారు ఆవిధంగా మాట్లాడితే మనం కొంత మేరకు అర్ధంచేసుకోవచ్చు. కానీ అన్నీ తెలిసినవారే వక్రభాష్యాలు చెప్తుంటే జీర్ణించుకోవటం కష్తమే కదా?!

ఒకవైపు ఎందరో సాంకేతిక నిపుణులు, ఔత్శాహికులు-వీవెన్‌, నల్లమోతు శ్రీధర్, శ్రీనివాస, శ్రీకర, రవివైజాసత్య, ఒరెమునా, చదువరి, ఇంకెందరో నిస్వార్ధంగా ఎంతో విలువైన తమ సమయాన్ని వెచ్చిస్తూ, బహుముఖ ప్రజ్ఞాశాలులైన కొత్తపాళీ, సత్య సాయి కొవ్వలి, రామనాధరెడ్డి వెంకట్, సౌమ్య, రాధిక, నిషిగంధ, తాడేపల్లి, నువ్వు శెట్టి బ్రదర్స్, ఇలా ఎందరో తమతమ రచనలతో, రాకేశ్వర, పరుచూరి శ్రీనివాస్ లాంటి వారు తమ విలువైన వ్యాఖ్యానాలతో, అందరినీ సమన్వయం చేస్తూ దీప్తిధార రావుగారు,జ్యోతి గారు ఇలా ఎందరో రైలు పట్టాల లాగా ఎంతో బాధ్యతగా సంతోషంగా తెలుగు బ్లాగుల బండిని ముందుకు నడిపిస్తున్నారు.


తెలుగువాడిని,గారపాటి ప్రవీణ్ లాంటి వారు బ్లాగుల కు మరికొన్ని హంగులు,ఆదాయం కామెంట్లు పెరగటం ఇలాంటి విషయాల మీద ఎన్నొ ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.ఎవరి ఆత్మానందం కోసం వారు రాసుకోవచ్చు,తప్పులేదు,కానీ ఎవరో అసంతృప్తి ని దృష్టిలో ఉంచుకోని బ్లాగులు ఆగవు.ఇది నిజం,బ్లాగులదే భవిష్యత్.

17 comments:

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

దురదున్నోడు రాయాలి...., పుండు పడ్డోడు మానాలి...!!

కొత్త పాళీ said...

అంతర్జాలంలో విహారం ముఖ్యంగా వినోదం కోసమే అనే అపోహ జనాల్లో బలంగా ఉంది. ఒక అభిప్రాయ వేదికగా ఇంకా ఎదగలేదు. ఈ పరిణామం ఇంకా జరగ వలసి ఉంది. గిట్టినవి గిడుతూ, కొత్తవి పుడుతూ ఉండగా .. క్రమం తప్పకుండా స్వంత ఆలోచనల్తో నడుస్తున్న బ్లాగులు వందైనా ఉన్నాయో లేదో. నిర్మాణాత్మకమైన చర్చలు, అభిప్రాయ వేదికలు, తీర్మానాలు జరగడానికి ఈ సంఖ్య గణనీయంగా పెరగాలి. ప్రస్తుతానికి ఈ బ్లాగులకి పాఠకులం .. ముఖ్యంగా .. ఇతర బ్లాగరులమే. ఈ స్థితి కూడా మారాలి. రెగ్యులర్ గా రాసే బ్లాగర్లలోనే .. తన బ్లాగు ద్వారా, లేదా బ్లాగ్లోకంలో తన పార్టిసిపేషన్ ద్వారా తాను ఏమి సాధించాలనుకుంటున్నాను అనే విషయం పై చాలా మందికి స్పష్టత లేదు. ఆ స్పష్టత ఉన్న బ్లాగర్లు బయటికి స్పందన కనిపించినా, కనిపించక పోయినా తమ పని ఆపట్లేదు. చేవ తగ్గట్లేదు. ఉదా: తాడేపల్లి, నెటిజెన్, మేధ, ఏది నిజం శ్రీధర్, ఇత్యాది

మాగంటి వంశీ మోహన్ said...

రాజేంద్ర గారూ

మీరు రాసిన టపాలోనే దీనికి ఒక మంచి సమాధానం ఉన్నది. "సమాచార విస్ఫోటనం అన్నది ఆగేది కాదు" కాబట్టి మన పని మనం చేసుకుంటూ, మన అభిప్రాయాలు మన వరకు వ్యక్తపరచుకుంటూ పోతూ ఉంటే, అది తప్పో ఒప్పో పెద్ద మనసు ఉన్నవారు ఆ విస్ఫోటనం తప్పుదారి పడుతోందా , విశ్వశాంతికి ఉపయోగపడుతోందా అన్నది తెలియచేస్తారు. అదీ వారి వారి సమయానుకూలతను బట్టి. అలాగే బ్లాగులు, దానిలో ఉన్న టపాలు అన్నవి ఒకరి కామెంట్ల కోసం ఆశ పడి రాసేవి కావు. అలా కామెంట్ల కోసమే రాసే టపాలు నిజమయిన టపాలు కావు కాబట్టి వాటి గురించి ఆలోచి మన బుఱ్ఱ బద్దలు కొట్టుకోవటం అంతకన్నా మంచి పని కాదు...ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మన పని మనం "బాధ్యతాయుతం"గా చేసుకుంటు పోతూ ఉంటే చాలు...అదండీ మరి నా అభిప్రాయం...

మాగంటి వంశీ మోహన్ said...

రాజేంద్ర గారూ

మీరు రాసిన టపాలోనే దీనికి ఒక మంచి సమాధానం ఉన్నది. "సమాచార విస్ఫోటనం అన్నది ఆగేది కాదు" కాబట్టి మన పని మనం చేసుకుంటూ, మన అభిప్రాయాలు మన వరకు వ్యక్తపరచుకుంటూ పోతూ ఉంటే, అది తప్పో ఒప్పో పెద్ద మనసు ఉన్నవారు ఆ విస్ఫోటనం తప్పుదారి పడుతోందా , విశ్వశాంతికి ఉపయోగపడుతోందా అన్నది తెలియచేస్తారు. అదీ వారి వారి సమయానుకూలతను బట్టి. అలాగే బ్లాగులు, దానిలో ఉన్న టపాలు అన్నవి ఒకరి కామెంట్ల కోసం ఆశ పడి రాసేవి కావు. అలా కామెంట్ల కోసమే రాసే టపాలు నిజమయిన టపాలు కావు కాబట్టి వాటి గురించి ఆలోచి మన బుఱ్ఱ బద్దలు కొట్టుకోవటం అంతకన్నా మంచి పని కాదు...ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మన పని మనం "బాధ్యతాయుతం"గా చేసుకుంటు పోతూ ఉంటే చాలు...అదండీ మరి నా అభిప్రాయం...

Unknown said...

అసలు బ్లాగులు ఎవరు మొదలు పెట్టాలి? ఎందుకు వ్రాయాలి? అన్న ఆత్మవిమర్శకు తావేలేదు. కావ్యాలు మేమెందుకు వ్రాయాలి? పురాణాలు మేమే ఎందుకు చెప్పాలి? అని మన పూర్వీకులు గమ్ముగా వ్యవసాయం చేసుకుని ఉండి ఉంటే మనకవి ఈనాడు దక్కేవా? ఎన్ని కొత్త కార్లు వచ్చినా అంబాసిడర్ వన్నె తగ్గనట్లే, చేవగల బ్లాగాధీశులున్నంతకాలం తెలుగు బ్లాగులకు ఢోకా లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కోసారి రేడియోలో ఒక అద్భుతమైన సంగీతం వస్తుంది. అప్పుడు దాన్ని ఆస్వాదించటానికీ, ఆనందాన్ని పంచుకోవటానికి ఎవరూ తోడు లేక బాధ పడుతుంటాం. అలాంటి బాధ లేకుండా నేడు ఈ బ్లాగులు, బ్లాగర్లే మన స్నేహితులు. మన స్పందన తెలపటానికి, వేదనని వెల్లడించటాని బ్లాగులిచ్చినంత వెసలుబాటు ఇంక ఎందులోనూ లేదు. ఒకరికి ఒకరు గా తోడయి పరస్పరం సహాయం అందించుకుంటే తెలుగు జాతి విలువ రెట్టింపవుతుంది. కొత్తపాళీ గారన్నట్లు బ్లాగుల పాఠకులు అధికభాగం బ్లాగర్లే. అంతకన్నా ఆశించడం కూడా మంచిది కాదన్నది నా అభిప్రాయం.

-నువ్వుశెట్టి బ్రదర్స్

రవి వైజాసత్య said...

ఒకటి మాత్రం ఆలోచించాలి...చదివిన వాళ్ళంతా వ్యాఖలు చేయాలనుకోవటం ముమ్మూటికీ దురాశే. ఉదాహారణకి ఒక మంచి టీవీ ప్రోగ్రామును చూసిన వాళ్ళలో ఎంతమంది స్టూడియోకి ఫోన్ చేసి స్పందిస్తారు? అలాగే ఒక పత్రికా సంపాదకీయాన్ని చదివిన వాళ్ళలో ఎంతమంది పత్రికలకు ఉత్తరాలు వ్రాస్తారు? బ్లాగులు కూడా పై మాధ్యమాలకి భిన్నమేమీ కాదు. స్పందన వ్యక్తపరచడం ఈ మాధ్యమంలో సులువైనంతమాత్రన అందరూ స్పందించాలని ఆశించలేము.
తెలుగులో బ్లాగులు ఇంకా ఒక క్రిటికల్ మాస్ కు చేరలేదు. అందుకే ప్రస్తుత బ్లాగర్లు కొంత నిబ్బరముగా ముందుకు సాగాలి (ఉందిలే మంచికాలం ముందు ముందునా !!) :-)

సూర్యుడు said...

My 4 paise here ;)

1. The question itself is not in the right spirit. Hackers (not crackers) resisted and have been resisting and will resist any control. There is no question of one person or one organization or group deciding who should write and who should not

2. At least from my side, writing in Telugu is a hindering factor in providing comments on everything I read, there are some exceptions though.

3. Even if some one writes or gives comment, you have already decided to disallow anonymous comments, on top of that there is a comment moderation, I really don't know whether this comment sees the light of the day or not. The same thing happened when I have given my comment on a post, my comment was not published but another post, advising not to give comments (anonymously) through another post ;). BTW, I will write a separate post on this ;)

4. Last but not the least, the topic should be compelling enough to provide a comment.

Best regards,
sUryuDu :-)

జాన్‌హైడ్ కనుమూరి said...

ఒకసారి మసులో అనుకున్న అలోచన బయటికి చెప్పడటం వలన అంతర్గతంగా స్థిరపడతాయి.
రాయడవల్ల, పదే పదే మట్లాడటంవలన పరిణతిని, ఆలోచనలోని విషయంపై పట్టును సాధించగలమని నా అభిప్రాయం.
ఇక్కడ ఒక హిందీ పాట గురుతుకొస్తుంది.

కుచ్ తో లోగ్ కహేంగే
లోగోకా కాం హై కెహనా

ఎవరో ఎదురుచూడటం వలన నడక/పరుగు కుంటుపడ్తుంది

రవి said...

రాజేంద్ర గారు, మీరన్నది నిజమే. మనం చదివిన బ్లాగ్ లకు కనీస స్పందన వచ్చినా, ఆ వుత్సాహం, ఎన్నో కొత్త ఆలోచనలకు వూపిరి అవుతుంది. ఇది అత్యాశేనా ? కాదు. కాబట్టి, చదివిన బ్లాగుకు ఓ చిన్న కామెంట్ రాయడం మంచి అలవాటు. ఈ విషయం లో ప్రవీణ్ గార్లపాటి, రాధిక గారు, కొత్త పాళీ వగైరా..లను మనస్పూర్తిగా అభినందించాలి.

రవి said...

రాజేంద్ర గారు, మీరన్నది నిజమే. మనం చదివిన బ్లాగ్ లకు కనీస స్పందన వచ్చినా, ఆ వుత్సాహం, ఎన్నో కొత్త ఆలోచనలకు వూపిరి అవుతుంది. ఇది అత్యాశేనా ? కాదు. కాబట్టి, చదివిన బ్లాగుకు ఓ చిన్న కామెంట్ రాయడం మంచి అలవాటు. ఈ విషయం లో ప్రవీణ్ గార్లపాటి, రాధిక గారు, కొత్త పాళీ వగైరా..లను మనస్పూర్తిగా అభినందించాలి.

మంజుల said...

మంచి క్వాలిటీ ఉన్న టపాలకి ఎక్కువ కామెంట్లు వస్తాయనేమాట నిజమే కానీ, దాని కన్నా ఎక్కువగా వివాదాస్పదమైన టపాలకి కామెంట్లు ఎక్కువొస్తాయి. మనకి నచ్చిన టపా మీద వ్యాఖ్య రాయటానిక్కూడా చాలా సార్లు బద్ధకిస్తాం కానీ చర్చ ను లేవనెత్తేవి గానో, ఆవేశ పరిచేవి గానో ఉన్న టపాలకి వ్యాఖ్య రాయకుండా నిగ్రహినంచుకోవటం కష్టం.

Ramani Rao said...

ఎవరో ఒకరు ఎపుడో అపుడు కదలరా ముందుకు అటో ఇటో ఎటో వైపు.. all the best రాజేంద్ర కుమార్ గారు.మీ ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనఃస్పూర్తిగా కోరుకొంటూ..

జ్యోతి said...

రాజేంద్రగారు,,

ముందుగా ఒక్క విషయం.. మనం మనకు నచ్చిన విషయం మన బ్లాగులో రాసుకుంటున్నాము.వ్యాఖ్యలు వస్తే సంతోషమే కాని వాటికోసం ఎదురుచూసి నిరాశ చెందడం మంచిదికాదు. అప్పుడు మనము తర్వాతి టపా రాయలేము , మన ఆలోచనలు కదలవు కూడా. బ్లాగుల గురించి ఇంకా ప్రచారం జరగాలి. బ్లాగులు రాసేవారందరూ మేధావులు కారండి. వ్యాఖ్యలు రాయాలంటే చాలా ఓపిక కావాలి. కొన్ని టపాలు చదువుతుండగానే మనకు దానికి వ్యాఖ్య రాయలనిపిస్తుంది. అన్ని అలా అనిపించవు మరి. అది రాసేవారి తప్పు కాదు. చదివేవారి మనస్తత్వము. కొందరికి కొన్నే నచ్చుతాయి. అందుకే ఎవరినీ తప్పు పట్టలేము. రవి అన్నట్టు టివిలో చూసిన మంచి ప్రోగ్రామ్ గురించి మనం టివి స్టూడియో కి ఫోన్ చేసి చెప్పము కదా. ఇక్కడ రాసేవాళ్ళందరూ పండితులు మేధావులు కారు. తమలోని ఆలోచనలు, అనుభూతులు అచ్చమైన తెలుగులో రాసుకోవచ్చు అనే చిన్నిపాటి సంతోషంతో ఉన్నవారే ఎక్కువమంది. వ్యాఖ్యల కోసమే టపాలు రాసేవారు తక్కువ, ఉన్నా ఎక్కువ రోజులు మనలేరు బ్లాగ్లోకంలో. ఇంకా ఎన్నో మంచి రచనలు ఉన్న బ్లాగులు రావాలి. ఎందరో మేధావులు, మహాపురుషులు మన చుట్టు ఉన్నారు. కాని వాళ్ళకు అంతర్జాలంలో తెలుగులో రాయడం రాదు. అటువంటి వారి రచనలు మనమే పూనుకుని వాళ్ళ అనుమతితో రాయాలి. అప్పుడు వాసి గల బ్లాగులు పెరుగుతాయేమో.. ఒక్కటి ఇక్కడ వ్యక్తిగత విభేదాలు కూడదు. ఎవరి అభిప్రాయం వారిది. చదివి వదిలేయాలి. దాని గురించి ఎక్కువ ఆలోచించి బాధపడితే మన సమయం వృధా అవుతుంది. మనసు కలత చెందుతుంది. అంతె.

Rajendra Devarapalli said...

ఈ బ్లాగు పోస్టు లోని నిరాశా నిస్పృహలు నావికావని సవినయముగా మనవి చేసుకుంటున్నాను. అవి కొందరు కొన్ని సందర్భాలలో పేర్కొన్న వ్యాఖ్యలుగా గ్రహించగలరు .

సత్యసాయి కొవ్వలి Satyasai said...

మంచి చర్చ.

Unknown said...

తెలుగు లో టైపు చేసి వెబ్ లో వెతకండి

Madhu said...

Add telugu search power to your blog:

Details visit:

http://gultus.blogspot.com/