Tuesday, July 29, 2008

ఈరెండు దినపత్రికల్లో ఈలావు బూతులు

ఈరెండు దినపత్రికల్లో ఈలావు బూతులు ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ చూడలేదు నేను.యనభైల్లో యన్.టీ.ఆర్.ఎవడబ్బసొమ్మని అన్నందుకే గగ్గోలు పుట్టింది,మరి ఈ ప్రేలాపనలు ఏమిటి?అసలు వాగింది వాగినట్లు అచ్చంగా అలాగే ఇకనుంచి ఇస్తారేమో!!!???

ఆంధ్రజ్యోతి లో ఇలా.
ఈనాడు లో ఇలా,

ప్రజాశక్తి,

సాక్షి,

వార్త,
ఆంధ్రభూమి

11 comments:

సుజాత వేల్పూరి said...

బూతులు వంటి అశ్లీల పదాల ప్రచురణ మాత్రమే కాకుండా..
అత్యాచారానికి గురైన స్త్రీల ఫొటోలే కాక, పేర్లు కూడా రాయడం (వారి క్షేమం దృష్ట్యా) మంచిది కాదనీ,
బాబు దాడులు, ఘోర ప్రమాదాలు జరిగినపుడు రక్తం ఓడుతూ ఉండె ఫొటోలు ప్రచురించకూడదనీ...ఇలాంటివే కొన్ని సూత్రాలు కొన్ని ఉన్నాయటకదండీ పత్రికలకూ, జర్నలిస్టులకూ?

ఎప్పుడూ ఎవరూ పాటించినట్టు కనపడదేం? టీవీ చానెళ్ల వాళ్లైతే ముప్పాతిక మొహాన్ని చూపిస్తూ, మిగిలిన పావు మొహాన్ని(ఆ పాటికే వాళ్ళ మొహం క్లియర్ గా తెలిసిపోతుంది లెండి)ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ఉంటారు. ఒక చానెల్ వాళ్లైతే ఎప్పుడూ 'వ్యభిచారంలోకి దింపబడ్డ ఆడవారి ' పై కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటారు తరచుగా! వారిని ఆ వృత్తిలోకి దింపేవారినెలాగూ పట్టుకోలేక...ఈ నిస్సహాయ స్త్రీలను పట్టుకుని 'ఎంతమందితో చేసావు? ఎంత డబ్బు వచ్చింది, అసలు వచ్చిందా లేదా? ఇప్పుడు కూడా చేస్తున్నావా" అని, వాళ్ల భర్తల్ని 'నీకు తెలిసే పంపావా? నీకెంత ముట్టింది?" (అప్పుడు ఆ భర్త మొహం ఎంత కుంగిపోయి ఉంటుందో చదువరులే గ్రహింతురు గాక) అడుగుతుంటే ఏ లెవెల్లో అసహ్యించుకోవాలో కూడా అర్థం కాదు. మెరుగైన సమాజాన్ని ఇలాగే సృష్టిస్తారు కాబోలు!

రాజేంద్ర కుమార్ గారు,
పత్రికలో బూతుల సంగతి వదిలేసి అసందర్భ ప్రసంగం చేసి ఉన్నట్లైతే క్షమించ గలరు

భావకుడన్ said...

రాజేంద్ర కుమార్ గారు,

నాకైతే అన్ని వార్తలూ ఇలాగే రావాలి అని అనిపిస్తుందండీ.

ఎవరి సంస్కారం ఎలాటిదో ఇలాటి వాటి వల్లనే కదా తెలిసేది. ఒక మనిషిని, అధికారిని పట్టుకొని పది మంది ముందు "రాజు గారి మేనల్లుడు" ఇలా దుర్భాషలాడితే కిందా పైనా మూసుకుని కూర్చునే చేతకాని సమాజం మనది(I am not apologetic...ఇంకా ఘాటుగా చెప్పాలని ఉంది అసలు)

వార్తా పత్రికలూ మన సమాజానికి అద్దం పట్టాలి కదా? నాకు ఇందులో ఏ మాత్రం తప్పు కనిపించలేదు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఈ రోజుల్లో ఉన్నదున్నట్లు రాస్తే ఒక బాధ, రాయకపోతే ఇంకో బాధ. ముఖ్యంగా భాషాప్రయోగం దగ్గర ! ఉన్నదున్నట్లు రాస్తే "మా మాండలికాన్ని ఎగతాళి చేశా"రంటారు. ప్రామాణిక మాండలికాన్ని వాడితే "ఎప్పుడూ అదేనా ? మా మాండలికానికి పేపర్లలో ప్రయోగార్హత లేదా ?" అని దాడి చేస్తారు. రాసేవాడు అందఱికీ లోకువే.

ఈ వార్తల్ని ప్రచురించినవారు ఎవరనేది పరిగణనలోకి తీసుకోవాలి. వీరంతా పాలక కాంగ్రెస్ కి వ్యతిరేకులు కనుక మంత్రిగారి తమ్ముడి మాటల్ని Reported speech లో కాకుండా ఇలా Direct speech లో రాయడం వాళ్ళ తక్షణ రాజకీయావసరం.

అంతమాత్రాన మన తెలుగు పాత్రికేయ విలువలకు ఇప్పటికిప్పుడు వచ్చిపడిన (కొత్త) ప్రమాదమేమీ లేధనుకుంటా.

Srikanth said...

అదే మరి పత్రికా స్వేచ్చ
వాళ్ళు ఏది రాశినా అంతే మరి

సుజాత వేల్పూరి said...

క్షమించరాని అచ్చుతప్పు! బాంబు దాడులు అని ఉండాలి, నేను రాసిన పై కామెంట్లో, బాబు దాడులు అని రాశాను.

చిలమకూరు విజయమోహన్ said...

ప్రజా సేవకులమని చెప్పుకుంటున్న నాయకులే సభ్యత మరిచి నోరు చేసుకుంటున్నప్పుడు పత్రికలు వారన్నది యథాతథంగా వ్రాయడంలో తప్పు లేదనుకుంటాను.

PAVANKALYAN[I.A.S] said...

తండ్రికి కొడుకే కాడెద్దు కావటమనే దైన్యస్తితి ఎందుకొచ్చింది?ఎలా తీరుతాయి మనరైతులకీ వెతలు?
మనరైతులకీ
వెతలు ఈ దోసుకునే నాయకులు పోయి సేవ చెయ్యాలి అని వున్న ప్రజా సేవకుడు గా కొత్త నాయకుడు వచ్చినప్పుడు

గురువుగారు చర్చా వేదిక చాల బావుంది మీ బ్లాగ్ నుంచి చాల కొత్త విషయాలు తెలుసుకున్నాను మీకు కృతజ్ఞతగా వుంటాను

PAVANKALYAN[I.A.S] said...

తండ్రికి కొడుకే కాడెద్దు కావటమనే దైన్యస్తితి ఎందుకొచ్చింది?ఎలా తీరుతాయి మనరైతులకీ వెతలు? మనరైతులకీ వెతలు ఈ దోసుకునే నాయకులు పోయి సేవ చెయ్యాలి అని వున్న ప్రజా సేవకుడు గా కొత్త నాయకుడు వచ్చినప్పుడు