పలు దినపత్రికలనుండి వివిధ అంశాలను తీసుకుని,వాటిమీద చిన్నపాటి చర్చను ఇక్కడ జరపాలన్నది ఈ టపా ఉద్దేశ్యం.అందరూ అన్నిటికి సమాధానాలు ఇచ్చినా సంతోషమే,కొందరు కొన్నిటికి,లేక అన్నిటికి జవాబులు చెప్పినా సంతోషమే.వీలయినన్ని ఎక్కువ సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నించాల్సిందిగా మనవి.అందుకే ఈ ఆదివారం మీకు విశ్రాంతి లేదు అంది...:)
వార్త దినపత్రిక వారు ఆహ్వానిస్తున్న ఈ చర్చకు మీరిచ్చేసమాధానాలు ఏమిటి?

తనవయసుకు సగానికి పైగా పెద్దవాడిని ప్రేమించటం,పెద్దలు కాదనటం,ఇంట్లొ బంధించటం...ఇదంతా ఏమిటసలు??

ఇలాంటి పొలంగట్టుల మీద,కాలవకట్టలమీద కనీసం మన పిల్లలు ఆడుకునే రోజులొస్తాయంటారా?

చందమామ పత్రిక పిల్లలకు పోటీలు నిర్వహించటం లో అంతరార్ధం పత్రికా ప్రచారమా?లేక పిల్లల్లో అవగాహన పెంచటమా??కానీ పూర్తిగా మహానగరాలను మాత్రమే ఈ పోటీలకు వేదికలుగా ఎంపికచేయటంలోని పరమార్ధం?

ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఇలాంటివాల్ పేపర్లు పైగా పరోక్షంగా మద్యపానానికి ప్రచారం చేసే వాటిని ప్రచురించవచ్చా?దీనివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా??

మహేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి ప్రచారానికొస్తాడా?ఒకవేళ వస్తే తప్పేమిటి?నందమూరి వారసులంతా తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి వస్తే కుటుంబమద్ధత్తు ఎందుకయ్యింది?అదే మహేష్ బాబు వస్తే పద్మాలయకు లాభం చేకూర్చే పని ఎలాఅయ్యింది?

కధారచయితలు తయారౌతారా?పుట్టుకొస్తారా?అవగాహనా సదస్సుల వల్ల సమకూరే లాభాలు??

తండ్రికి కొడుకే కాడెద్దు కావటమనే దైన్యస్తితి ఎందుకొచ్చింది?ఎలా తీరుతాయి మనరైతులకీ వెతలు?

కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ చిరంజీవి పార్టీకి పనిచేస్తాను..అంటున్న చేగొండి హరిరామజోగయ్య మాటలకు అసలు అర్ధముందా?ఉంటే ఏమిటని మీభావన?


రాజమండ్రి పురపాలకసంఘం వారు,కందుకూరి వీరేశలింగంగారి భవనానికి ఇంకా పన్ను కట్టమని తాఖీదులు పంపుతున్నారు,ఆయన గురించి సదరు రా.పు.సం వారికి మీరు ఎలా జ్ఞానబోధ చేస్త్రారు?

పద్యకావ్యాలకు ప్రత్యేకంగా పోటీలు ..వీటివల్ల తెలుగుపద్యానికి,ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనముంటుందని మీరు భావిస్తున్నారా??
8 comments:
రాజేంద్ర!
ఏందబ్బా? అసలేవరి స్పందనా లేదు!
మీరు మొదలుపెట్టండి మరి :)
ఒక ఉచిత సలహా .. ఇలా అరడజను విషయాల్ని వెదజల్లి చర్చించండి అనే కన్నా, ఏదో ఒక విషయం మీద ముందు మీ వ్యక్తిగత ఆలోచన లేవిటి అని క్లుప్తంగానో విశదంగానో ముందు మీరొక Opening Statement చేస్తే, అప్పుడు జనాలు వచ్చి పాల్గొనే అవకాశం ఏమన్నా ఉంటుంది.
గురూగారు,మీకు ఈ ఆదివారం అసలు విశ్రాంతిలేకుండా చెయ్యాలని కదా ప్లాను??!! :)
ఒక్కటంటే ఒక్క ఆదివారం - ఏడిపించకండి దాన్ని !
ఒక్కొక్క విషయం చర్చించమనండి - బావుంటాయి. వీజీ.. ఇక్కడ స్పందిద్దామనుకునీసరికీ విషయం మర్చిపోతున్నారేమో చదువరులు!
'చందమామ ' విషయం - నగరాల్లో నిర్వహించడం ఫీసిబుల్ ! స్కూళ్ళలో ప్రోత్సాహం దొరుకుతుంది. గ్రామ గ్రామానికీ వెళ్ళి నిర్వహించమంటే, ఆర్ధికంగా పెను భారం! పైగా ఇలాంటివి సాధారణంగా పత్రిక సర్క్యులేషన్ ను పెంచుతాయి. ఇండియా ఇప్పుడు ఎక్కువగా పట్టణాల్లోనే నివసిస్తుంది కదా! ఎక్కువ మంది ప్రోస్పెక్టివ్ పాఠకుల్ని చేరేందుకు పట్టణాలూ, నగరాలే సరైన వేదికలు !
ప్రేమ విష్యం - రోజులులు మారుతున్నాయి. సరే ! ప్రేమకి వయసు లేదు. కానీ, మారనిది మాత్రం తల్లిదండృల ప్రేమకి ఉన్న ఒక్కటే లక్ష్యం/లక్షణం - ప్రొటెక్టివ్ నెస్. పిల్లల్ని రక్షిస్తున్నామనుకునే భ్రమ లో ఉంటారు తల్లి దండ్రులు ! ఇలాంటివి తొందరలో మారవు. పిల్లలు ఒక వయసు దాటాకా, పెద్ద వాళ్ళ మీద ఆర్ధికంగా ఆధారపడకుండా తమ బ్రతుకు తాము బ్రతికితే, ఇలాంటి గొడవలు రావు.
పిల్లలు ఆటలు - ప్రమోట్ చెయ్యాలే గానీ ఇవి కూడా సాధ్యమే ! మరి పట్నాల్లోకి పొలాలు ఎలా తెస్తారు ? పొలాలూ, గట్లూ ఇళ్ళు అనేవి ఇళ్ళూ, కాలనీలూ అయిపోకుండా మిగిలితే చూద్దాం. అదేదో సైన్స్ ఫిక్షన్ లా గా కొన్నేళ్ళకి మేన్ మేడ్ పొలం, గట్టూ, కాలువలూ కట్టిన ఎస్సెల్ వర్ల్డ్ కి తీసికెళ్ళాలి మన పిల్లల్ని. అదే పరిష్కారం.
ఆంధ్ర జ్యోతి : ఒహ్హో ! మీరు మరీనూ. మద్యం, మగువా అంటే, జాతి, ప్రాంత, భాషా మత బేధాలు లేకుండాఅ అందరికీ ఇష్టమే. వీటివల్ల మహిళల మనో భావాలు అప్పుడప్పుడూ దెబ్బ తింటాయి.. కానీ పర్లేదు. వాళ్ళు వేరే పనుల్లో బిసీ ! ఇలాంటివి ఆంధ్ర జ్యోతి కాదు - 'టైంస్ ఆఫ్ ఇండియా ', 'హిందూస్తాన్ టైంస్ ' లో కూడా మరీ ఎక్కువ గా ప్రచురిస్తారు. వాటిల్లో కొన్ని ఫోటోలు ఎంత విశృంఖలంగా ఉంటాయంటే, బుద్ది ఉన్న తల్లిదండృలెవరూ అలాంటి వార్తా పత్రికలను కొననే కూడదు అనిపించేంతగా!
మహేష్ : తప్పకుండా రావచ్చు. అసలు నేను కూడా రావొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది.
కధా రచయితలు : కొంచెం గైడన్స్, కొన్ని పరిచయాలూ, కధా రచయితలకు పనికి వచ్చే అంశాలే ! పుట్టుకొచ్చే వాళ్ళు మొదటి రకం క్వాలిటే అయితే, తయారయ్యే వాళ్ళ క్వాలిటీ వేరు ! మంచి ది అనిపించే పనులు మంచివే. ఇవి ఎవరో ఎవరికో సాయం చెయ్యాలనే ఉద్దేస్యం తో నిర్వహించేవి కాబట్టి, వీరి ఎఫర్ట్స్ ఏవీ అనవసరంగా వృధా కావు.
రైతుల వెతలు :- నాకు అవగాహన లేదు. ఎలా తీరుతాయో తెలీదు.
హరి రామ జొగయ్య : - తెలీదు !
కందుకూరి భవనం :- ఒక ట్రస్ట్ అనేది ఉంటే, అది పన్ను వైవర్ కి లేఖలు రాసి, లాబీయింగ్ చేసి ఈ పరిస్తితి ని తెగ్గొట్టాలి. ఈ తాఖీదులు సంబంధిత పురపాలక సాఖ వారి క్లర్క్ బాగా పని చేస్తున్నరని తెలియ చేస్తాయి.
పద్యాల పోటీలు : పనికి వస్తాయి.
I hope I covered all the topics.
చాలా థాంక్స్ సుజాత గారు,మీరు తప్పక స్పందిస్తారనుకున్నాను.
rajendra kumar gaaru...
mee charchaa vedika super.
okkokka daanigurichi charchiste baaguntundani naa feeling. this is not to order my requist only..
meeku nenu thanks cheppali..
nenu konchem speedgaa type chestu andhra nu anndhra gaa raasaanu .. meeru cheppina tharuvaatha chusukoni sarididdanu.
boss..
novemberlo nenu raasina neti vaarthanu chadivi spandistaarani vinathi.
http://telugupallavi.blogspot.com/2008_11_01_archive.html
Post a Comment