Wednesday, June 25, 2008

ఆంధ్రజ్యోతి మీది దాడి మొదటిది కాదు,చివరిదీ కాదు..

అర్ధరాత్రి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు,మరిద్దరు జర్నలిస్టులను అరస్టు చెయ్యటం పట్ల నా నిరసనను తెలియజేస్తున్నాను.ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల
యోగక్షేమాలు గురించి,సాధకబాధకాల గురించి ఏర్పడిన అంతర్జాతీయసంఘం కమిటి
COMMITTE FOR THE CONCERNED JOURNALISTS,NEWYORK(http://www.concernedjournalists.org/) సభ్యుడిగా ఇటీవల కాలములో పాత్రికేయులపట్ల కొన్ని
సంస్థలు ,వ్యక్తులు జరుపుతున్న అరాచకాలు,దాడులను పరిశీలిస్తుంటే అధికారపార్టీ,ప్రతిపక్షపార్టీ అని ఎలాంటి తేడాలు లేకుండా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని అవగతమౌతుంది.కానీ,కర్ర ఉన్న వాడిదే బర్రె అన్నసామెత ఇక్కడ పరోక్షంగా అమలుతుంది.కాస్త నోరు గలవాడిమీదో,పెద్దమీడియా సంస్థలలోనో పనిచేసేవారి మీద జరిగే దాడుల పట్ల వివిధ సంఘాల,మీడియా ఖండనలు,నిరసనలు ఒకరకంగా ఉంటే బక్కబడుగు వ్యక్తులు,సంస్థల్లో పని చేసేవారికి ఆమాత్రం సానుభూతి,సహానుభూతి కరువౌతుంది.

ఉదాహరణకి నెల్లూరు జిల్లా ఉదయగిరి లో వార్త విలేఖరికి జీవనాధారమైన హోటలును కూల్చి వేసారు.కానీ రాష్ట్రస్థాయిలో దాదాపు ఎలాంటి మద్దతు లభించలేదు




తాజా గొడవకు మూలకారణమైన బాడుగనేతలు అన్న వార్తాంశం పై ఆంధ్రభూమి సంపాదకులు యం.వి.ఆర్.శాస్త్రి గారు తన సహజశైలిలో ఇలా స్పందించారు.


జనసామాన్యం లో అధికసంఖ్యాకులకు మీడియా సరైన ప్రాతినిధ్యం కల్పించటం లేదంటూ పొనుగోటికృపాకర్ మాదిగ ఇలా అంటున్నారు..


ఇక ఉత్తరాంధ్రలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అనబడు తెలుగు దేశం పార్టీ నేత వీరంగాలు ఇక్కడి జర్నలిస్టులకు కొత్తకాదు.ఇది ఇటీవలి వారి ఉగ్రరూపానికో ఉదాహరణ..












కొద్దిరోజుల క్రితం యన్టీవి విలేఖరి మీద జరిగిన దాడి గూర్చి పెద్దలు పెద్దగా స్పందించలేదు.అసలు జర్నలిస్టు నాయకులు ఏసందర్భం లో ఎలా స్పందిస్తారో అర్ధం కావటం లేదని జర్నలిస్టు మిత్రులు ఆక్రోశిస్తున్నారు.చూడాలి ఆంధ్రజ్యోతి,మంద కృష్ణమాదిగల వివాదం ఏ మలుపు తీసుకుంటుందో...



7 comments:

శ్రీ said...

మంచి వివరాలు అందించారు రాజేంద్ర కుమార్ గారు.

సుజాత వేల్పూరి said...

ఆంధ్ర జ్యోతి మీద దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పట్ట పగలైతే ప్రజల నుంచి కూడా నిరసన ఉంటుందని భయపడి అర్థ రాత్రి ఈ పిరికి చర్యకు ఒడిగట్టారు. దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టడం చరిత్రలో ఇదే మొదటి సారైనట్టు, అది ఘోరమైన నేరమైనట్టు ప్రవర్తిస్తున్నారు! ఇందాక టివిలో చూశాను, ప్రెస్ మీట్ లో జానా రెడ్డి కి మాటలే లేవు! చేసింది తప్పు కాకపోతే రోశయ్య లాగా కనీసం ఆర్గ్యుమెంట్ కోసమైనా మాట్లాడొచ్చే! అసలు దిష్టిబొమ్మను కొట్టిన పనికి SC ST attrocity కింద కేసు పెట్టడానికి వీలే లేదని మాడభూషి శ్రీధర్ అంటున్నారు.

fourth estate ని అణగదొక్కాలని ప్రయత్నిస్తే ఎమర్జెన్సీ తర్వాత ఇందిర కు పట్టిన గతే వీళ్లకూ పడుతుంది. విళెకరులను వేధించటం ఇదే మొదటి సారి కాకపోయినా, ఇక ముందు ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే మీడియాకు కేవలం మీడియా నుంచే కాక ప్రజల నుంచి కూడా సపోర్ట్ కావాలి!

Bolloju Baba said...

రాజేంద్ర కుమార్ గారు
మీరు అందించిన అన్ని అంశాలలోకెల్లా, యం.వి.ఆర్.శాస్త్రి గారి వీక్ పాయింట్ నచ్చింది. ధన్యవాదములతో.
బొల్లోజు బాబా

GKK said...

పత్రికలు, చానెళ్ళు తాము ఎవ్వరికీ జవాబుదారీ కాము మాకిష్టం వచ్చిన రాతలు రాస్తాము, అసత్యాలను, అర్ధ సత్యాలను నిజాలుగా మారుస్తాము అని విర్రవీగటం ఎక్కువయ్యింది. ఆంధ్రజ్యోతికి మందకృష్ణ మాదిగ తగిన శాస్తి చేశాడు. పత్రికలు ’we are accountable to none' ధోరణి పోవాలి.

netizen నెటిజన్ said...

@రాజేంద్రుడు: ఇంకా ఉలకలేదు పలకలేదేమిటికి జవాబుగా ఈ టపా కనపడింది.

పత్రికా యాజమాన్యాలు, పత్రికలను వ్యాపారదృష్టితో నడుపుతున్నప్పుడు, వారికి ఇతరమైన వాణిజ్యావసరాలున్నప్పుడు, సంపాదకుడూ గాని, పాత్రికేయుడు గాని, ఆ పత్రిక యాజమాన్యానినికి మడుగులొత్తవలసినదే.

ఈ భూమి మీద నేడు అక్షరజ్యోతులను వెలిగిస్తున్న ప్రతి సూర్యుడికి తమకంటూ కొన్ని వ్యాపారాలున్నవన్ని మరచిపోరాదు.

అలాగే నేటి పాత్రికేయుడికి తన వృత్తిపై ఒక నిర్దుష్టమైన అభిప్రాయమున్నదని అనుకోరాదు.

Rajendra Devarapalli said...

@సుజాత గారు,మాడభాషి శ్రీధర్ గారు ఏమన్నారో నాకు తెలియదు గానీ,మీడియా గురించి,ఇంకా మిగిలినవాటి గురించీ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ,కాలాలు నిర్వహిస్తున్న ప్రొఫెసరు గారొకాయన జర్న్లలిస్టుల కోటాలో ఇళ్ళస్థలానికి ప్రభుత్వం వారికి ధరఖాస్తు పెట్టుకున్నారట మరి!

netizen నెటిజన్ said...

ఆయనకి ఈ ప్రభుత్వం పట్టా ఇవ్వకపోతే ఆశ్చర్య పోవాలి!